Chandrababu Winning Celebrations: కుటుంబ సభ్యులతో చంద్రబాబు.. విజయోత్సవ వేడుకల ఫోటోస్ వైరల్..
2024 ఎన్నికల్లో టీడీపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. మ్యాజికల్ ఫిగర్ దాటి తెలుగు దేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది.
1970 లో చంద్రబాబు నాయుడు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరారు..
చంద్రబాబు 1989 -1995 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి సీఎంగా పనిచేశారు.
ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు
పదేళ్ల తర్వాత 2014-2019 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
2019 ఓటమి తర్వాత 2024 రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీటులను దక్కించుకుని విజయఢంకా మోగించింది.
చంద్రబాబు నాయుడు 1992 లోనే హెరిటేజ్ ఫుడ్స్ స్థాపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులు అయిన భువనేశ్వరితో కలిపి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
నారా లోకేష్, బ్రహ్మణీ, బాలకృష్ణ సతీమణి వసుంధర, దేవాన్ష్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇప్పటి వరకు టీడీపీ 72 సీట్లలో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 88. ఈ నేపథ్యంలో టీడీపీ మరో 65 సీట్లలో ఆధిక్యంలో ఉంది.