New Liquor Policy: మందుబాబులకు పండగే.. బిర్యానీ కంటే తక్కువ ధరకే బీర్లు.. కొత్త పాలసీ ఇలా..!
మద్యం పాలసీ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని మంత్రులు ఇటీవల సమావేశమై.. లిక్కర్ విధానంపై చర్చించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ బ్రాండ్లపై నిషేధం విధించారు. అంతేకాదు మద్యం ధరలు కూడా భారీగా పెంచేశారు. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో తెగ సంబరపడిపోతున్నారు.
బ్రాంది, విస్కీ, బీర్లలో గతంలో ఉన్న బ్రాండ్లను విక్రయించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను తక్కువ ధరకే అందించేందుకు కసరత్తు చేస్తోంది.
తక్కవ ధర కేటగిరిలో ఒక క్వార్టర్‌ను రూ.80 నుంచి రూ.90 లకే అందించే దిశగా ఆలోచిస్తోంది. ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజా ఆరోగ్యమే ముఖ్యమని మంత్రివర్గ ఉప సంఘం చెబుతోంది.
ప్రస్తుతం ఏపీలో బీరు ధర రూ.200 నుంచి 220 రూపాయల వరకు ఉంది. బీరు ధర రూ.130 నుంచి రూ.150 వరకు తగ్గించేలా ప్రణాళికలు చేస్తోంది.
తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను పరిశీలిస్తున్నారు. ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన నివేదికను సబ్ కమిటీ పరిశీలిస్తోంది.
మద్యం విధానం రూపొందించిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీని అమలు చేయనున్నారు.