Apple 2024 iPad Pro: ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొత్త మోడల్ త్వరలో లాంచ్, ఎలా ఉంటుందంటే

Mon, 28 Aug 2023-6:44 pm,

ఆపిల్ కంపెనీ 2024లో ఎం3 ఆపిల్ సిలికాన్ చిప్‌సెట్ , ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు ఐప్యాడ్ ప్రో లైనప్ దింపేందుకు సిద్ధమౌతోంది. ఇందులో కొత్త మోడల్ 12.9 ఇంచెస్ వేరియంట్ స్థానంలో ఉండవచ్చు.

ఆపిల్ 2024లో తన ఐప్యాడ్ ప్రో లైనప్ కోసం ఎం3 ఆపిల్ సిలికాన్ చిప్‌సెట్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే దింపవచ్చని తెలుస్తోంది. కొత్త మోడల్ 11 ఇంచెస్ , 13 ఇంచెస్‌లో రావచ్చని అంచనా. 

కాలిఫోర్నియాలోని టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్..అప్‌కమింగ్ ఐప్యాడ్ ప్రో ద్వారా ట్యాబ్ మార్కెట్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అటు ఐప్యాడ్ ప్రోలో 2018 తరువాత ప్రోసెసింగ్ పవర్, డిస్‌ప్లే క్వాలిటీ, కెమేరా సామర్ధ్యంలో సాధారణ మార్పు మాత్రమే  కన్పించింది.

ఆపిల్ తన అప్‌కమింగ్ ఆపిల్ సిలికాన్ చిప్, ఎం3ను ఐప్యాడ్ ప్రోలో లైనప్ చేయాలని భావిస్తోంది. J717, J718, J720,J721 కోడ్ నేమ్ కలిగి ఐప్యాడ్ ప్రో 2024లో లాంచ్ కానుంది. ఇందులో ప్రధానంగా ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చు.

ఐ ప్యాడ్ ప్రోతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన మ్యాజిక్ కీబోర్డ్‌లో కూడా ఆపిల్ మార్పులు చేసింది. ఇందులో అతిపెద్ద ట్రాక్ ప్యాడ్ ఇంటిగ్రేట్ చేసింది కంపెనీ. ఇప్పుడున్న కాన్ఫిగరేషన్‌తో పోలిస్తే అత్యధిక శక్తివంతమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link