Boiled Vegetables Benefits: ఉడికించిన ఆహారం తినడం మంచిదేనా? వాటి వల్ల కలిగే లభాలు ఏంటి?
ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరం ఎంతో దృఢంగా ఉంటుందని ఆరోగ్యనిపుణు చెబుతున్నారు.
ఉడికించిన వాటిలో బఠానీలు, శనగలు, పప్పులు తీసుకోవడం వల్ల ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి.
ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బచ్చలికూర, పాలకూర తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్ కె ఇతర పోషకాలు పుష్కలంగా అందుతాయి.
బంగాళదుంపలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు లభిస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ రైస్, ఓట్స్ , క్వినోవా వంటి ఉడికించిన తృణధాన్యాలలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. దీనిలో అధిక శాతం ఫైబర్ , పోషకాలు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది.