Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో కింద పడకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు గాజు వస్తువులు కూడా కింద పడకూడదు. గాజు వస్తువులు కింద పడి పగిలితే ఇంటికి అరిష్టం కలుగుతుంది. ఇలాంటి సంకేతాల వల్ల కొన్ని పనులు పాడవుతాయి. కొన్ని పనుల్లో వైఫల్యం కలుగుతుంది.
ఇంటి వంటగదిని కూడా అత్యంత పవిత్రంగా చూసుకుంటాం. వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. అయితే, పూజగది తర్వాత వంటగదికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి వంటగదిలో కొన్ని వస్తువులు మన చేయి నుంచి జారిపోకుండా ఉండాలట. ఇలా జరగడం వల్ల ఇంటికి వాస్తు దోషం చుట్టుకుంటుంది.
అవనూనె.. వాస్తు ప్రకారం అవనూనె ఇంటి వంట గదిలో కింద పడకూడదు. ఎందుకంటే ఇది శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం అవనూనె వంట గదిలో కింద పడితే శని దోషం కలుగుతుందట. ఇది దరిద్రం చుట్టుకోవడానికి దారితీస్తుందట. ముఖ్యంగా వంట గదిలో అవనూనె కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉప్పు.. ఉప్పు చంద్రునితో లింక్ ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి వంటగదిలో ఉప్పు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు లక్ష్మి దేవికి ప్రతిరూపం. ఉప్పు వంటగదిలో కింద పడకూడదు. ఇది కూడా వాస్తు దోషానికి దారి తీస్తుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
పాలు.. ప్రతిరోజూ పాలు తాగుతాం. ఇంట్లో టీ కాఫీలకు పాలు వినియోగిస్తారు. అయితే, పాలు మరగకాచినప్పుడు కింద పడకుండ జాగ్రత్త తీసుకోవాలి. వాస్తు ప్రకారం పాలు కింద పడటం కూడా దోషానికి దారితీస్తుందట. వంటగదిలో ఎట్టిపరిస్థితుల్లో పాలు పొంగకుండా జాగ్రత్త తీసుకోవాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)