Bonalu Holiday 2024: ఆ రోజే బోనాల పండుగ సందర్భంగా సెలవు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణలో బోనాల పండుగను ఎంతో వేడకగా జరుపుకుంటారు. ఇప్పటికే అనేక చోట్ల బోనాల హడావిడి ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు కూడా బోనాల పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇటీవల మంత్రి కొండా సురేఖ బోనాల పండుగపై అధికారులతో సమావేశం అయ్యారు. ఎక్కడ కూడా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. బోనాలను ఎంతో వేడుకగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచనలు జారీ చేశారు.
జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ఆషాడ మాసం ప్రారంభమౌతుంది. ఈసారి జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది. జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం మొదలౌతుంది. ఇక జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం హైదరాబాద్ లో బోనాల పండుగ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు.
గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
జూలై 7న ఆదివారం నుంచి బోనాలు, ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతాయి. ఒక నెల పాటు హైదరాబాద్ అంతాట ఒక పండుగలా ఉంటుంది. శివస్తులు, పోతురాజులు,తొట్లేల ఊరేగింపులు గ్రాండ్ గా జరుతాయి.
ఇక తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ నేపథ్యంలో జులై 27 అధికారికంగా సెలవు ప్రకటించింది. అదే విధంగా జులై 27 శనివారం, మరుసటిరోజు 29 ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ రోజులు తెలంగాణలోని అన్ని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది.