Ashika Ranganath: మరో తెలుగు చిత్రానికి సైన్ చేసిన నాగార్జున హీరోయిన్.. ఈసారి ఏకంగా అలాంటి హీరోతో..!
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆమె కోసం సినిమాతో తెలుగుపేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఆశిక రంగనాథ్. తెలుగులో నాగార్జునకు జంటగా నా సామిరంగా చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించండి ఈ ముద్దమ స ఈ చిత్రం మంచి విజయం అందుకోవడంతో తెలుగులో వరుస అవకాశాలు తలుపుతట్టాయి.
ఇక వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో.. కోలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి ఈమె పై పడింది. అందులో భాగంగానే అధర్వకు జంటగా పట్టత్తు అరసన్ అనే సినిమాతో కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది .ఇక తాజాగా నటుడు సిద్ధార్థ హీరోగా వస్తున్న మిస్ యు సినిమాలో ఈమె నటించింది.
దీంతోపాటు కార్తీక్ సరసన సర్దార్ 2, మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.ఇకపోతే ఈ సినిమాలు ఇంకా విడుదల కాలేదు. అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ గా మంచి పేరు దక్కించుకున్న విశ్వక్ సేన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఆషిక రంగనాథ్.
ప్రస్తుతం తెలుగులో భారీ ఆఫర్లు అందుకుంటున్న ఈమెకు, ఇప్పుడు మళ్లీ తెలుగులో మరో అవకాశం రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.