Astro Tips: ఏ పువ్వుతో ఏ దేవుడిని పూజిస్తే మంచిది? ఈ పూలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి

Mon, 19 Aug 2024-7:14 pm,

Hindu Religious : సాధారణంగా పూజ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పువ్వులు. పువ్వులు లేని పూజను ఊహించలేము. పువ్వులు లేకుండా పూజ చేస్తే అసంపూర్ణంగానే ఉంటుంది. అందుకే చాలా మంది రంగురంగుల పువ్వులతో తమ ఇష్టదైవాన్ని పూజిస్తుంటారు. భక్తులకు ఇష్టమైన దేవుళ్లు ఉన్నట్లే... ఆ దేవుళ్ల కూడా ఇష్టమైన పువ్వులు ఉంటాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పువ్వులు లేకుండా చేసే పూజ పూజనే కాదు. మరి ఏ పువ్వుతో ఏ దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు చూద్దాం.   

త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువును తులసి, కిస్కార పుష్పాలతో పూజించడం అత్యంత శ్రేయస్కరం. తులసి తల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది.  

 శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు తులసి, పారిజాత పుష్పం ఉండాలి. క్లీరసాగర మథనం జరిగిన సమయంలో పారిజాత వ్రుక్షం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. దాన్ని విష్ణువు తనతోపాటు స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతుంటారు.   

దుష్టనాశకుడైన వినాయకునికి పటిక పూల దండ ఉత్తమం. వినాయక ఉత్సవాల్లో, వినాయక విగ్రహానికి పూలమాల వేయడం చూడవచ్చు. ఇది వాస్తు దోషాన్ని కూడా సరిచేస్తుంది.  

ఆంజనేయుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం. ఆంజనేయుడిని మల్లెపూలతో పూజిస్తే ప్రసన్నుడవుతాడు.  

దుర్గా దేవి, కాళి, చాముండి దేవితో సహా అమ్మవారి ఆరాధనలో ఎరుపు రంగు దశవాలాలను శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.  

శివుడిని పూజించే భక్తులు ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో ఉన్న కాయల్లాంటి పువ్వులు కాస్తాయి. అవంటే శివుడికి చాలా ఇష్టం.   

నీలిరంగు పువ్వులంటే శనిదేవుడికి ఇష్టం. అందుకే శనిదేవుడికి నీలిరంగు పువ్వులు సమర్పించాలి. నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శనిదేవుడికి సమర్పించవచ్చు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link