Astrology: 30 యేళ్ల తర్వాత శని రాశిలో అరుదైన రాజయోగం.. ఈ 3 రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని మంద గమనుడు అంటారు. ఈయన ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. అంతేకాదు అపుడపుడు తన తిరోగమనం చెందుతుంటాడు. అందులో వక్రంలో ఉన్న శని దేవుడు అత్యంత శక్తివంతంగా పరిగణిస్తారు. జూన్ 30 నుండి, శని కుంభరాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. దాదాపు 139 రోజుల తర్వాత నవంబర్ 15, 2024న మళ్లీ వక్ర గమనం నుంచి శని దేవుడు సరైన గమనంలో ప్రయాణించడం మొదలుపెడతారు.
దీని వల్ల కుంభరాశిలో 'శష రాజయోగం' ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, శని గమనం మారడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగబోతుంది. ఈ సమయంలో ఈ రాశుల వారి గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న బాధల నుండి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి..
కుంభ రాశిలో ఏర్పడే శశ రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం మీకు అండగా ఉంటుంది. అంతేకాదు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఎంతో పురోగతి సాధిస్తారు. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్‌లో విజయాల మెట్లు ఎక్కుతారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
కన్య రాశి.. కుంభ రాశిలో ఏర్పడే శశ రాజయోగం వలన కన్యా రాశి వారికీ అనుకోని లాభాలను అందుకుంటారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తత అవసరం. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి.
కుంభ రాశి: శని రాశిలో శశ రాజయోగం వల్ల కుంభరాశి వారి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి. కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. పెట్టుబడి మూలక రాబడి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.