Wedding: ఈ పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో వెంటనే పెళ్లి బాజాలు.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..
కొందరికి రాహుదోషాలు ఉంటాయి. దీంతో జ్యోతిష్యులను సంప్రదించి సరైన శాంతులు, దానాలు, పూజలు చేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
మనం ఉదయం పూట స్నానం చేసేటప్పుడు బకెట్ లో పసుపు వేసుకుని స్నానంచేస్తే మంచి ఫలితాలు ఉంటాయంట. పసుపు కొమ్మును కూడా కడ్చీఫ్ లో పెట్టుకొవాలి. దాన్ని జాగ్రత్తగా పెట్టుకొవాలి..
ఇంట్లో చనిపోయిన పితృదేవతలకు శ్రాధ్దకర్మలు చేస్తుండాలి. ఆ రోజున వీలైన పేదవారికి ఏదైన దానధర్మాలు చేయాలి. గతించిన వారికి ఇష్టమైన పదార్థాలు పేదవారికి పంపిణి చేయాలి..
పేదవారు పెళ్లి చేసుకొవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి వివాహనికి తమ వంతుగా ఏదైన సహాయం చేయాలి. ఇలా చేస్తే తొందరగా పెళ్లికుదురుతుందని చెబుతుంటారు.
మంగళవారం, శుక్రవారం రోజు రాహు దీపారాధన చేయాలిన కూడా జ్యోతిష్యలు చెబుతుంటారు. ప్రత్యేకంగా ఈ సమయంలో నిమ్మకాయలలో దీపాలను పెట్టాలి. ఇలా దీపారాధన చేస్తే అమ్మవారికి అనుగ్రహం ఉంటుదని జ్యోతిష్యులు సూచిస్తుంటారు