Lucky Fathers: ఆ 3 రాశుల అమ్మాయిలతో వారి తండ్రులకు ఎనలేని అదృష్టం...
కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు వారి తండ్రికి, కుటుంబానికి చాలా అదృష్టవంతులు. వీరి జాతకంలో గ్రహాలు సరిగ్గా ఉంటే.. ఈ స్త్రీలు జన్మించినప్పటి నుంచి ఆ ఇంటిలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. సుఖ, సంపదలు కలుగుతాయి. తండ్రికి పదోన్నతి, ఆదాయం లభిస్తాయి. ఈ రాశి స్త్రీలు చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. అన్ని పనులను పూర్తి నిబద్ధతతో చక్కబెడుతారు. అతి చిన్న వయసులోనే గొప్ప విజయాలు సాధిస్తారు.
మకర రాశి స్త్రీలు చాలా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు నిజాయితీపరులు, చాలా దయగలవారు. తమ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. అందరిపై ప్రేమను కురిపిస్తారు. ఈ స్త్రీలకు తండ్రితో చాలా బలమైన బంధం ఉంటుంది. ఈ స్త్రీలు ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధిస్తారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా కష్టపడతారు. లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే వారు రిలాక్స్ అవుతారు.
కన్యారాశి స్త్రీలు తమ తండ్రికి కూడా చాలా అదృష్టవంతులు అవుతారు. తమ ప్రతిభతో తండ్రి పేరును, కుటుంబ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. ఈ రాశి స్త్రీలకు వివిధ కళలపై ఆసక్తి ఎక్కువ. పలు రంగాలలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. చిన్నప్పటి నుంచి తెలివైనవారిగా గుర్తింపు తెచ్చుకుంటారు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారం ఆధారంగా ఉంది. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)