Automatic Cars: రూ. 7 లక్షలలోపే టాప్ మైలేజ్ ఇచ్చే 5 ఆటోమెటిక్ కార్లు ఇవే..!
రినాల్ట్ క్విడ్.. ఆటోమెటిక్ ఫీచర్ కలిగి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్ల జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఇది దేశంలోనే అత్యంత తక్కువ ధరలోనే మనం కొనుగోలు చేయగలిగే కారు. మీరు తక్కువ డబ్బుతో ఆటోమెటిక్ గేర్ బాక్స్ కలిగిన కారు కొనుగోలు చేయాలంటే ఇది సూపర్ ఆప్షన్. ఇక రినాల్ట్ క్విడ్ ఆటోమెటిక్ కారు ఎక్స్‌షోరూం స్టార్టింగ్ ధర మన దేశీ మార్కెట్లో రూ. 5.44 లక్షల్లో ఉంది.
మారుతి సుజుకీ ఆల్టో కే 10.. తక్కువ ధరలో ఆటోమెటిక్ కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్. ఇది మన దేశీయ కార్ల విక్రయాల్లో ఎక్కువ శాతం మంది కొనుగోలు చేస్తున్న కారు. మారుతి సుజుకీ ఆల్టో కే 10 కారుకు కూడా ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు కొనుగోలు చేయాలంటే ఎక్స్‌షోరూం ఆటోమెటిక్ కారు స్టార్టింగ్ ధర రూ. 5.51 లక్షలు ఉంది.
మారుతి సుజుకీ ఎస్‌ప్రెస్సో.. ఆటోమెటిక్ కార్లు కేవలం మీరు అనుకున్న అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలంటే మరో సూపర్ కారు మారుతీ సుజుకీ ఎస్‌ప్రెస్సో.ఇది కూడా ఆటోమెటిక్ గేర్ బాక్స్ కలిగన మారుతీ కంపెనీకి చెందిన కారు. ఎస్‌ప్రెస్సో ఆటోమెటిక్ మారుతీ సుజుకీ కారు ఎక్స్ షోరూం ధర రూ. 5.66 లక్షలు.
మారుతి సుజుకీ సెలేరియో.. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న ఆటోమెటిక్ కార్లలో మారుతి సుజుకీ సెలేరియో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఆటోమెటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంది. ప్రస్తుతం దీన్ని ఎక్స్‌షోరూం ధర రూ.6.28 లక్షలు మాత్రమే
మారుతి సుజుకీ వేగన్ ఆర్.. మారుతి కంపెనీకి చెందిన మరో ఆటోమెటిక్ కారు. ఇది మన దేశీయ మార్కెట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న కార్లు. ఇది కూడా ఆటోమెటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంది. మారుతి వేగన్ ఆర్. ఏడు లక్షల్లో ఆటోమెటిక్ కారు కొనుగోలు చేయాలనుకునేవారికి బెస్ట్. ఈ కారు ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ. 6.44 లక్షలు మాత్రమే.