Balakrishna: బాలకృష్ణ నా తమ్ముడు కాదు.. షాక్ ఇచ్చిన ఏపీ సీఎం భార్య..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఇటీవలే ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈయనకు సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ తన సొంత టాలెంట్ తో భారీ పాపులారిటీ అందుకున్నారు.
ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే, మరొకవైపు రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టేశారు బాలయ్య. ఇక మరొకవైపు ఆహా ఓటిటి వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి అయిన ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా ఆరు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలుపెట్టారు చిత్ర బృందం. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఆమె బాలకృష్ణ తన తమ్ముడు కాదంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి నారా భువనేశ్వరి చేసిన ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Nara Bhuvaneshwari about Balakrishna తాజాగా ఇటీవల ఒక సభలో పాల్గొన్న నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. బాలకృష్ణ నా తమ్ముడు కాదు. నాకు అన్నయ్య.. రెండు సంవత్సరాలు నాకంటే పెద్దవాడు. కానీ చాలామంది నా దగ్గరకు వచ్చి మీ తమ్ముడు బాలకృష్ణ ఎలా ఉన్నారు? అని అడుగుతుంటే.. నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామందితో చెప్పాను. బాలకృష్ణ నాకు తమ్ముడు కాదు అన్నయ్య అని, కనీసం ఇప్పటికైనా నన్ను కలిసి బాలకృష్ణ గురించి అడిగేటప్పుడు మీ అన్నయ్య ఎలా ఉన్నారని అడిగితే అప్పుడు నేను సంతోషపడతాను అంటూ తెలిపింది నారా భువనేశ్వరి.