Balayya: తస్సాదియ్యా.. తెలుగులో ఫస్ట్ ప్యాన్ ఇండియా హీరో బాలయ్యేనా.. ఇదిగో ప్రూఫ్..

Wed, 09 Oct 2024-2:32 pm,

Balakrishna Pan India Star: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా   తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య. అవును ఇపుడు అందరు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ 90లలోనే బాలకృష్ణ తన సినిమాతో ప్యాన్ ఇండియాను మార్కెట్ ను షేక్ చేసారు.

90ల ప్రారంభంలో  బి.గోపాల్ దర్శకత్వంలో విజయ లక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై టి.త్రివిక్రమ్ రావు నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చిత్రం తెరకెక్కింది.  ఈ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అంతేకాదు నిప్పులాంటి మనిషి,  కొండవీటి సింహం, అంకుశం తర్వాత పోలీస్ సినిమాల్లో రౌడీ ఇన్ స్పెక్టర్  ఓ ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచిపోయింది. అప్పటి వరకు పోలీస్ పాత్రలంటే నీతి, నిజాయితీతో కూడి ఉండేవి. ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సినిమాలో మాత్రం అన్యాయం అంతం చేయడానికి పోలీసు .. రౌడీ గా మారిన తప్పులేదని ఈ చిత్రంలొ చూపించారు.

లారీ డ్రైవర్ మూవీ తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ చిత్రం బాలకృష్ణకు జోడిగా విజయ శాంతి నటించారు. మిగతా పాత్రల్లో హరీష్, మోహన్ రాజు, కెప్టెన్ రాజు, సాయి కుమార్, రాఖీ, నిర్మలమ్మ, కోట, జగ్గయ్యనటించారు

బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన 16వ చిత్రం రౌడీ ఇన్ స్పెక్టర్. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో నటించారు.

ఆ రోజుల్లోనే ఈ సినిమా 35 సెంటర్స్ లలో 100రోజుల నడిచింది.  అంతేకాదు పలు కేంద్రాల్లో రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాను తమిళంలో ‘ఆటోరాణి’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక హిందీలో ఈ సినిమాను ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ టైటిల్ తోనే డబ్ చేసి రిలీజ్ చేసారు.

అప్పటి వరకు ముంబైలో అత్యధిక కలెక్షన్స్ వసూళు చేసిన హిందీ డబ్బింగ్ చిత్రంగా ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఒక రకంగా అప్పట్లోనే ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో బాక్సాఫీస్ ను తన తరంలో షేక్ చేసిన హీరోగా నిలిచారు బాలయ్య.

బాలయ్య కంటే ముందే ఎన్టీఆర్ ‘చండీ రాణి’, ఏఎన్నార్.. ‘సువర్ణ సుందరి’ చిత్రాలతో ప్యాన్ ఇండియా లెవల్లో బాలీవుడ్ ను షేక్ చేసారు. ఆ తర్వాత వాళ్లు తెలుగు చిత్ర సీమకు పరిమితమైపోయారు. 

‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ చిత్రానికి ఆంజనేయ పుష్పానంద్ కథను అందించారు. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. కోటగిరి వేంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు. వియస్ఆర్ స్వామి కెమెరా మెన్ గా పనిచేసారు.

 

రౌడీ ఇన్ స్పెక్టర్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ రావు నిర్మాణంలో బాలయ్య.. ‘బొబ్బిలి సింహం’ సినిమా చేసారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా రౌడీ ఇన్ స్పెక్టర్.. 90లలో బాక్సాఫీస్ ను ప్యాన్ ఇండియా లెవల్లో షేక్ చేసిన చిత్రంగా నిలవడం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link