Cricketer Wedding Photoshoot: మహిళా క్రికెటర్ వెడ్డింగ్ ఫొటోషూట్‌కు నెటిజన్లు ఫిదా

Thu, 22 Oct 2020-9:46 am,

#SanjidaIslamWeddingPhotoshoot | ఈ మధ్య వెడ్డింగ్ ఫొటోషూట్ ఒక్కో తరహాలో చేసుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ (Cricketer Sanjida Islam) వినూత్నంగా తన వెడ్డింగ్ ఫొటోషూట్ ప్లాన్ చేశారు. పెళ్లిరోజు వధువుగా ముస్తాబై క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్‌తో దర్శనమిచ్చారు. బంగ్లాదేశ్ క్రికెటర్ సంజిదా ఇస్లామ్ చేత బ్యాట్ పట్టి వెడ్డింగ్ ఫొటోషూట్‌ (Sanjida Islam Wedding Photoshoot)లో పాల్గొన్నారు.

ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఐసీసీ, ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో సైతం మహిలా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ వెడ్డింగ్ ఫొటోషూట్‌కు ఫిదా అయ్యాయి. ఆమె వెడ్డింగ్ ఫొటోషూట్‌ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. (Image Credit: Twitter)

బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెటర్‌ మిమ్‌ మొసాద్దెక్‌తో జాతీయ క్రికెటర్ సంజిదా ఇస్లామ్ వివాహం ఇటీవల జరిగింది. కాగా, పెళ్లిరోజు బ్యాట్‌ చేతపట్టి ఆటపై తనకున్న ఇష్టాన్ని చాటుకుందని బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్‌‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. (Image Credit: Twitter)

2014లో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్‌ జట్టులోకి సంజిదా ఇస్లామ్ అడుగుపెట్టింది. ఆసియా కప్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌ జట్టయిన భారత్‌ను 2018లో ఓడించి తొలిసారి కప్ సాధించిన బంగ్లాదేశ్ జాతీయ జట్టులో సంజిదా ఇస్లామ్ సభ్యురాలు. (Image Credit: Twitter)

(Image Credit: Twitter)

(Image Credit: Instagram)

(Image Credit: Twitter)

(Image Credit: Twitter)

(Image Credit: Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link