Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక కారణమేంటి, రిజర్వేషన్ల వివాదం ఎప్పటిది, నేపధ్యమేంటి
పార్లమెంట్ భవనంలో, ప్రధాని నివాసంలో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిపై దాడులు జరిగాయి. దాంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా ఇచ్చి ఇండియాకు ఆశ్రయం కోసం వచ్చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆర్మీ రంగంలో దిగి పరిస్థితి పర్యవేక్షిస్తోంది.
ఆగస్టు మొదటి వారంలో మరోసారి ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈసారి ఏకంగా 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ పెరిగింది. వేలాదిగా నిరసనకారులు రోడ్డెక్కారు
దాంతో కోటా పునరుద్ధరణను నెలరోజులు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయినా నిరసనలు ఆగలేదు. రిజర్వేషన్లపై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అలా ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. 2500 మంది గాయపడ్డారు.
ఇటీవల 2024 జూన్ 5వ తేదీన రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని కోర్టు తీర్పు ఇవ్వడంతో రిజర్వేషన్లను పునరుద్ధరించింది ప్రభుత్వం.అంతే నిరసన మొదలైంది. ఆందోళన తీవ్రమైంది. జూలై 1 నుంచి జూలై 21 మధ్యకాలంలో భారీగా యూనివర్శిటీ విద్యార్ధులు రోడ్డెక్కారు. అధికార పార్టీ అవామీ లీగ్ తన పార్టీ మద్దతుదారుల్ని సివిల్ సర్వీసుల్లో తీసుకొచ్చేందుకు రిజర్వేషన్ కోటా ఉపయోగిస్తున్నారనే విమర్శలు రాజుకున్నాయి.
2018లోప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్‌తో పెద్దఎత్తున ఆందోళన ప్రారంభమైంది. బంగ్లాదేశ్ జనరల్ కేటగరీ విద్యార్ధుల హక్కుల పరిరక్షణ పేరుతో ఉద్యమం మొదలైంది. దాంతో షేక్ హసీనా ప్రభుత్వం ప్రధమ, ద్వితీయ శ్రేణి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ 2021లో బంగ్లాదేశ్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది.
ఆ తరువాత క్రమంగా 1996లో అంటే దాదాపు 20 ఏళ్ల తరువాత రిజర్వేషన్ లబ్ది పొందే నాటి తరం సంఖ్య తగ్గిపోయింది. దాంతో అదే రిజర్వేషన్‌ను తరువాతి తరానికి విస్తరించారు. 2009లో మూడో తరానికి సైతం ఇదే రిజర్వేషన్ విధానాన్ని కొనసాగించారు. అంతే అసంతృప్తికి బీజం పడింది
బంగ్లాదేశ్ సంక్షోభం, అల్లర్లకు కారణమైన రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదు. ఎప్పట్నించో ఉన్నదే. ప్రస్తుత ప్రధాని షేర్ హసీనా తండ్రి, ఆ దేశ జాతిపితగా కొనియాడే ముజీబుర్ రెహమాన్ 1976లో సివిల్ సర్వీసుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్ విమోచనంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు 30 శాతం, అదే యుద్ధం సమయంలో పాకిస్తాన్ చేతుల్లో అత్యాచారానికి గురైన బాధిత మహిళలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారు.