Belly Fat Exercises: బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగించే 5 సులభమైన వ్యాయామాలు ఇవే
స్కిప్పింగ్
స్కిప్పింగ్ మీ బెల్లీ ఫ్యాట్‌ను అద్భుతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. రోజుకు కనీసం 5-10 నిమిషాలు స్కిప్పింగ్ చేయాలి
మౌంటెయిన్ క్లైంబర్స్
ఇదొక బెస్ట్ కార్డియో ఎక్సర్‌సైజ్. బెల్లీ ఫ్యాట్ చాలా వేగంగా తగ్గుతుంది. ఫోటోలో చూపించిన భంగిమలో 20-30 సెకన్లపాటు ఉండాలి. ఇలా 10-12 సార్లు చేయాలి
లెగ్ రేజ్
శరీరంలో లోయర్ ఎబ్స్‌ను టార్గెట్ చేస్తుంది. దీనికోసం వీపుపై పడుకుని కాళ్లను నిటారుగా పైకి లేపాలి. కొన్ని సెకన్లు అలానే ఉంచాలి. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా కిందకు దించాలి. ఇలా 10-15 సార్లు చేయాలి
క్రంచెస్
క్రంచెస్ అనేది బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం వీపుపై పడుకుని మోకాళ్లు ముడవాలి. చేతుల్ని తల వెనక్కి పెట్టుకోవాలి. మీ భుజాల్ని నేల నుంచి పైకి లేపాలి. ఇలా 10-15 సార్లు చేయాలి.
ప్లాంక్
ఇదొక సులభమైన అత్యంత ప్రభావవంతమైన వ్యాయామ ప్రక్రియ. ఇది శరీరంలోని కీలకమైన కండరాలను బలోపేతం చేస్తుంది. కడుపు ఆధారంగా బోర్లా పడుకుని మీ శరీరాన్ని మోచేతులు పంజా ఆధారంగా పైకి లేపాలి. ఇలా 30-60 సెకన్లు ఉంచి క్రమంగా సమయం పెంచాలి