Belly Fat Tips: కడుపు, నడుము చుట్టూ బెల్లీ ఫ్యాట్ దూరం చేసే 5 అద్భుత యోగాసనాలు
ఉష్టాసనం
ఈ ఆసనం ద్వారా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. శరీరాన్ని సులభంగా స్ట్రెచ్ చేస్తుంది. మోకాలి నిలుచుని శరీరాన్ని వెనక్కు విల్లులా వంచాల్సి ఉంటుంది
భుజంగాసనం
దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం ద్వారా బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా తగ్గుతుంది.
కుంభాసనం
ఈ ఆసనం ద్వారా కడుపు షేపింగ్ సాధ్యమౌతుంది. ఈ ఆసనాన్ని ప్లాంక్ పోజ్ అని కూడా అంటారు. రోజూ క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కడుపు చుట్టూ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
ధనురాసనం
ఎక్కుపెట్టిన విల్లు ఆకారంలో పైన చిత్రంలో కన్పిస్తున్నట్టు మీ శరీరాన్ని వంచాలి. ఇలా చేస్తే కడుపు, నడుము చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది
నౌకాసనం
ఈ యోగాసనంలో శరీరాన్ని వి ఆకారంలో లేదా పడవ ఆకారంలో వంచాలి. బెల్లీ ఫ్యాట్ సమస్య అద్భుతంగా తగ్గుతుంది.