Shangri La versus Bermuda triangle: ప్రపంచపు అత్యంత రహస్యమయ ఘాటీ..బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాలతో

Wed, 23 Dec 2020-11:08 pm,

ఈ అత్యంత రహస్యమైన , వింతైన లోయ గురించి మరో ప్రముఖ విషయం ఏంటంటే..ఇక్కడి ప్రజలు వందలాది ఏళ్లు జీవించారని. డాక్టర్ గోపీనాధ్ కవిరాజ్ పుస్తకం చదివి..దేశ విదేశాలకు చెందిన పరిశోధకులు లోయ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు కానీ..విఫలమయ్యారు. కొంతమంది శాశ్వతంగా మాయమైపోయారు. చైనా ఆర్మీ ఒక లామాను అనుసరిస్తూ..ఇక్కడి వరకూ వచ్చినా..శాంఘరీ లోయ గురించి తెలుసుకోలేకపోయారని అంటారు.

ఇక్కడ మరో విశేషమేమంటే..మఠాలు, ఆశ్రమాలు, విభిన్న ఆకృతులతో మందిరాలున్నాయి. ఇక్కడ మూడు సాధనలు ప్రసిద్ధి చెందినవి. మొదటిది జ్ఞానగంజ్ మఠం, రెండోది సిద్ధ విజ్ఞాన ఆశ్రమం, మూడోది యోగ సిద్ధాశ్రమం.  సిద్ధాశ్రమం గురించి మహాభారత్, రామాయణం, వేదాల్లో కూడా ఉంది.

ఆధ్యాత్మిక క్షేత్రం, తంత్ర సాధన లేదా తంత్ర జ్ఞానానికి సంబంధించినవాళ్లకు ఈ ప్రాంతం గురించి చాలా బాగా తెలుసు. ఇక్కడ సూర్యుడి ప్రకాశమూ ఉండదు. చంద్రుడి కాంతీ ప్రసరించదు. వాతావరణంలో నలువైపులా తెల్లటి ప్రకాశం విస్తరించి ఉంటుంది. విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. 

టిబెట్ భాషలోని కాళ విజ్ఞానం పుస్తకంలో ఈ లోయ గురించి ఉంది. ఈ లోయలో కాలం అంటే సమయం ప్రభావం ఉండదట. అక్కడ ప్రాణం, మానం, ఆలోచనా శక్తి, శారీరక సామర్ధ్యం, మానసిక చైతన్యం ఎక్కువైపోతుందట. ఈ ప్రాంతాన్ని భూమి యెక్క ఆధ్యాత్మిక నియంత్రణ కేంద్రమని కూడా పిలుస్తారు. 

శాంఘరీ లోయ బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదే. బెర్ముడా ట్రయాంగిల్ లో ఓ నిర్ణీత ప్రాంతలో వెళ్లిన ఓడలు గానీ..విమానాలు గానీ అదృశ్యమౌపోతుంటాయి. చైనా సైన్యం చాలాసార్లు శాంఘరీ లోయ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని ప్రతీతి. 

టిబెట్ లోని ఈ రహస్యమైన లోయ గురించి ప్రముఖ పండితుడు అరుణ్ కుమార్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాలి  చొరబడని ప్రాంతాలున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో వెళితే..వస్తువు లేదా మనిషి అదృశ్యమైపోతాడు. అటువంటివాటిలో శాంఘరీ లోయ ఒకటి. బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదే..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link