Best FD Rate Banks: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఈ బ్యాంకులలో ఎఫ్‌డీలపై అదిరిపోయే వడ్డీ రేటు
సాధారణ కస్టమర్ట కంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులలో ఎఫ్‌డీపై 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకు ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కానీ 60 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై మూడేళ్లపాటు 9 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏవో ఓ లుక్కేయండి.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ వినియోగదారులుకు మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.6 శాతం వడ్డీని కస్టమర్లకు అందిస్తోంది. ఎఫ్‌డీ మెచ్యూర్ అయిన తరువాత వడ్డీ, అసలు కలిపి బ్యాంకు చెల్లిస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. మూడేళ్ల ఎఫ్‌డీపై 8.5 శాతం వడ్డీని అందిస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి ఎఫ్‌డీలపై 8.15 శాతం వడ్డీని అందిస్తోంది. ఈక్విటోస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.