Fiber Foods: ఫైబర్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవే, రోజూ తీసుకుంటే ఎన్ని లాభాలంటే
క్వినోవా
క్వినోవా అనేది హెల్తీ ధాన్యంగా పరిగణించాలి. రోజూ క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకుంటే ఫైబర్‌తో పాటు కావల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. ఒక కప్పు క్వినోవాలో 5.2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది
ఓట్స్
ఓట్స్‌ను బెస్ట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. రోజూ ఒక కప్పు ఓట్స్ తింటే 8 గ్రాముల డైటరీ ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.
బ్లాక్ బీన్స్
బ్లాక్ బీన్స్ ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనవి. ఇందులో ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు చాలా ఉంటాయి. కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఉదయం ఒక కప్పు బ్లాక్ బీన్స్ తింటే 15 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.
అవకాడో
అవకాడో చాలా ఖరీదైంది. కానీ ఇందులో ఫైబర్ సహా ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే అవకాడో తినడం వల్ల చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాడో మంచి ఆప్షన్ కాగలదు.
ఆపిల్
ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు. ఇది ముమ్మాటికీ నిజం. రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల దాదాపు 4.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది శరీరానికి చాలా చాలా మంచిది. వివిధ రకాల సమస్యల్ని దూరం చేస్తుంది