Weight Gain Tips: పీలగా ఉండి బరువు పెరగాలనుకుంటే ఏం చేయాలి
రోటీలో నెయ్యి కలిపి సేవిస్తే రుచిగా ఉండటమే కాకుండా బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. ఎందుకంటే నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటాయి. రోటీలో ఉండే కార్బొహైడ్రేట్లు శరీరానికి ఎనర్జీ అందిస్తాయి.
నెయ్యితో బరువు పెరగవచ్చు. కానీ పరిమితంగా ఉండాలి. ఎందుకంటే మరీ ఎక్కువ నెయ్యి సేవిస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాయామం, వాకింగ్ వంటివి చేయడం ద్వారా హెల్తీ వెయిట్ గెయిన్ సాధ్యమౌతుంది
ఇక అరటి పండు కూడా బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున అరటి పండుతో పాటు నెయ్యి తింటే శరీరం బరువు వేగంగా పెరుగుతుంది.
బరువు పెరిగేందుకు మరో విధానం నెయ్యి పాలు కాంబినేషన్. వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముంద తాగితే బరువు వేగంగా పెరగగలరు. అది కూడా హెల్తీ వెయిట్ గెయిన్ ఉంటుంది. మంచి నిద్ర కూడా పడుతుంది
బరువు పెరిగేందుకు మరో పద్ధతి నెయ్యి బెల్లం మిశ్రమం. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజూ భోజనం తరువాత ఒక స్పూన్ నెయ్యిలో కొద్గిగా బెల్లం కలిపి తింటే బరువు పెరుగుతారు