Skin Care Drinks: ముఖం, చర్మం నిగనిగలాడాలంటే ఈ 5 డ్రింక్స్ తాగాల్సిందే
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లతో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఉదయం వేళ తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ కారణంగా శరీరం మొత్తం హైడ్రేట్ అవుతుంది. ముఖం రంగు కళకళలాడుతుంది. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్ జ్యూస్ ముఖాన్ని శుభ్రం చేసేందుకు, చర్మానికి నిగారింపు తెచ్చేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. టొమాటో, కీరా, క్యారట్ కూడా బీట్‌రూట్‌తో మిక్స్ చేసి తీసుకోవచ్చు.
గ్రీన్ టీ
రోజూ ఉదయం వేళ గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనముంది. స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. డైట్‌లోగ్రీన్ టీ చేరిస్తే ముఖం మరింత అందంగా మెరిసిపోతుంది.
పండ్ల రసం
పండ్ల రసం ఆరోగ్యానికి ముఖానికి రెండింటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా క్యారట్, బీట్‌రూట్, దానిమ్మ, చిలకడదుంప జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.
నిమ్మరసం
శరీరాన్ని వివిద రోగాల్ని దూరం చేయడమే కాకుండా చర్మ సంరక్షణకు దోహదపడే పదార్ధాలు రోజూ ఉదయం తీసుకోవడం మంచిది. చర్మాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఉదయం వేళ నిమ్మరసం తాగాలి. రోజూ ఉదయం ఇలా చేయడం వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.