Heat Stroke Remedies: భగ్గుమంటున్న ఎండలు.. ఈ ఇంటి చిట్కాతో హీట్‌స్ట్రోక్‌కు చెక్ పెట్టండి..
Home Remedies For Heat Stroke: ఎండకాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ హీట్ స్ట్రోక్ కు గురవుతారు. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. ఇంటి వైద్యంతో కూడా వడదెబ్బ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్.. ఎండకాలం వడదెబ్బ నుంచి బయటపడాలంటే యాపిల్ సైటర్ వెనిగర్ మీ డైట్లో చేర్చుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మనల్ని వేసవి తాపం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
పుదీనా రసం.. వేసవితాపం నుంచి బయటపడటానికి పుదీనా కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పుదీనా చల్లదనాన్నిస్తుంది. మార్కెట్లో పుదీనా జ్యూసులు కూడా అందుబాటులో ఉంటాయి. లేకుంటే పుదీనా జ్యూస్‌ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మజ్జిగలో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని తాగండి.
లెమన్ వాటర్.. నిమ్మకాయ నీరు కూడా మనల్ని వేసవి తాపం నుంచి రక్షిస్తుంది. అంతేకాదు మీరు హీట్ స్ట్రోక్‌కు గురయితే నిమ్మకాయ నీటిని తాగండి. ఈ నీటిని ఉప్పు వేసి తయారు చేసుకోవచ్చు. లేదా చక్కెర వేసుకుని తయారు చేసకోవచ్చు. ఈ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కూడా హాట్ స్ట్రోక్‌కు గురికాకుండా ఉంటారు.
మ్యాంగో పన్నా.. వేసవి తాపం నుంచి బయట పడటానికి మామిడికాయలతో తయారు చేసుకునే మ్యాంగ్ పన్నాతో కూడా చెక్ పెట్టొచ్చు. మ్యాంగో పన్నాను తయారుచేసుకోవడానికి మామిడికాయలను ఉడకబెట్టి, పుదీనా, జీలకర్ర, బ్లాక్‌సాల్ట్, పంచదార వేసి కలుపుకొని తాగాలి. మ్యాంగో పన్నా హీట్‌స్ట్రోక్ సమస్య తగ్గిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )