Mint Leaves: పుదీనా ఆకుల్ని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవచ్చు
పుదీనా ఆకుల్ని ఎండలో అసలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల పుదీనా త్వరగా పాడయిపోతుంది. పుదీనా సువాసన కూడా పోతుంది.
పుదీనా ఆకుల్ని శుభ్రమైన బట్టలో చుట్టి కూడా ఉంచవచ్చు. దీనివల్ల ఎక్కువకాలం పుదీనా పాడుకాకుండా ఉంటుంది.
దీనికోసం ప్లాస్టిక్ ప్యాకెట్‌లో ఉంచితే ఇంకా మంచిది. దీనివల్ల గాలి అస్సలు చొరబడదు. చాలారోజుల వరకూ ఆకుపచ్చగా, తాజాగా ఉంటాయి. రబ్బర్ బ్యాండ్‌తో చుట్టేస్తే ఇంకా మంచిది.
పుదీనాను శుభ్రం చేసిన తరువాత ఓ శుభ్రమైన కాగితంలో చుట్టి చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. పుదీనా ఆకుల్ని ఎలా చుట్టాలంటే గాలి చొరబడకూడదు. లేకపోతే పాడైపోతాయి.
పుదీనా అనేది ప్రతి కిచెన్‌లో తప్పకుండా కన్పిస్తుంటుంది. దాదాపు ప్రతి వంటలో ఉపయోగించే పదార్ధం. ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా పాడవకుండా ఎక్కువకాలం ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పాడైన ఆకుల్ని తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఆకుల్ని తెంచి వేరు చేయాలి.