Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలు మర్చిపోతే అంతే..!
మ్యూచువల్ ఫండ్ అనేది వివిధ పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి.. సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది. ఇది ఫండ్ పెట్టుబడి లక్ష్యాలను బట్టి స్టాక్‌లు, స్థిర ఆదాయ సాధనాలు లేదా రెండింటి మిశ్రమంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాలు, ప్రభుత్వం, కార్పొరేట్ బాండ్‌లు, మనీ మార్కెట్ సాధనాలు, బంగారం, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్‌లను చెక్ చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ దీన్ని నిర్వహిస్తారు.
ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తక్కువ వ్యయ నిష్పత్తితో మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఖర్చును దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
అదేవిధంగా ట్యాక్స్‌కు సంబంధించి కొన్ని విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలపై ట్యాక్స్ విధిస్తున్న విషయం గుర్తు పెట్టుకోండి. తదనుగుణంగా మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
పెట్టుబడి క్వాలిటీని నిర్ణయించడానికి మీరు తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను చెక్ చేయాలి. అలాగే ఆ మ్యూచువల్ ఫండ్‌లో ఏయే కంపెనీలను చేర్చుకున్నారో చూడాలి. దీనివల్ల మీ డబ్బు ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ పొందే సదుపాయం కూడా ఉండాలి. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ లోడ్‌ను తనిఖీ చేయండి. పెట్టుబడి నుంచి తప్పుకునేటప్పుడు ఎఎమ్‌సీ ద్వారా వసూలు చేసిన రుసుములను కూడా చూసుకోండి.