Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి
మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, పోస్టాఫీసు స్కీములు, ఎల్‌ఐసీ పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(Voluntary Provident Fund) లాంటి పలు రకాల పెన్షన్ స్కీమ్, రిటైర్మెంట్ స్కీమ్‌లలో నగదు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈపీఎఫ్, పీపీఎఫ్ మరియు వీపీఎఫ్‌లలో దేని ద్వారా అధిక ప్రయోజనం పొందుతారు, ఎవరికి ఏ రకం ప్లాన్ అయితే బాగుంటుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
Also Read: Gold Rate Today: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, భారీగా పతనమైన వెండి ధరలు
Voluntary Provident Fund : స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ అనేది ఈపీఎఫ్ ఖాతాకు విస్తరించిన సేవల రూపమని చెప్పవచ్చు. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రకారం ఉద్యోగి తనకు కావాలసిన మొత్తం కన్నా అధికంగా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు నిల్వ చేసే నగదు మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇందులో నగదు సేవ్ చేసుకునేందుకు ఎలాంటి పరిమితులు లేవు. వడ్డీ సైతం ఈపీఎఫ్ ఖాతా మాదిరిగానే 8.5 శాతం లభిస్తుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజన్ (EPFO) ఖాతాలు కలిగి ఉండవచ్చు. ప్రభుత్వం సహకారంలో ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణ, వడ్డీ రేట్లు నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు మరియు వారు పనిచేస్తున్న సంస్థలు ఉద్యోగి బేసిక్ శాలరీలో 10 శాతం మొత్తాన్ని EPF Accountలో జమ చేస్తారు. గతంలో ప్రైవేట్ కంపెనీలకు ఈ వాటా 12 శాతంగా ఉండేది. ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న నగదును ఉద్యోగి పదవీ విరమణ, జాబ్ మానేసిన సందర్భంలో, లేదా కొన్ని అత్యవసర పరిస్థితులలో కొంతమేర నగదును విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఉద్యోగులు ఈ ఖాతాను కంపెనీ మారిన సమయంలో కొత్త సంస్థకు బదిలీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాలపై ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ లభిస్తుంది.
Public Provident Fund : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పొదుపు పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. స్వయం ఉపాధి ఉన్న వ్యక్తులు మరియు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కార్మికులు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి ఉన్నవారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏటా రూ .1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఏడాదిలో కనీసం రూ.500 మేర ఇన్వెస్ట్ పెట్టాలి. గరిష్టంగా రూ .1,50,000 కంటే ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం వీలుకాదు. పీపీఎఫ్ ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనాలు అందిస్తుంది.
ఒకవేళ మీరు ఉద్యోగి అయి ఉండి ప్రతినెలా తప్పకుండా చేతికి జీతం వచ్చేవారైతే ఈపీఎఫ్ లేదా వీపీఎఫ్ ఖాతాలలో నగదు ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. ఈ రెండింటిలో వడ్డీ 8.5 శాతం అందుకుంటారు. ఒకవేళ మీరు అసంఘంటిత రంగంలో కార్మికులు లేదా స్వయం ఉపాధి ఉన్నావారైతే మాత్రం పీపీఎఫ్‌లో డిపాజిట్ చేసుకోవడం సరైన నిర్ణయం. ఎందుకంటే మీ ఆదాయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కనుక మీ అంచనాలకు అనుగుణంగా పీపీఎఫ్‌లో నగదును జమ చేసుకుని ప్రయోజనాలు పొదవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook