Post Office Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్స్ కోసం పోస్టాఫీసు సరికొత్త స్కీమ్, Tax Benefits సైతం వర్తిస్తాయి

Post Office Senior Citizen Savings Scheme: కరోనా సమయంలోనూ సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు అనతికాలంలోనే అధిక లాభాలు పొందనున్నారు. పోస్టాఫీసు స్కీములో ఇన్వెస్ట్ చేసిన వయోజనులకు 7.4 శాతంతో వడ్డీ ప్రయోజనాలు అందిస్తుంది. అయిదు సంవత్సరాల కాలంలో 14 లక్షల వరకు భారీ మొత్తం ప్రయోజనం పొందుతారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 27, 2021, 07:04 PM IST
  • పోస్టాఫీసు స్కీములో ఇన్వెస్ట్ చేసిన వయోజనులకు 7.4 శాతంతో వడ్డీ
  • అయిదు సంవత్సరాల కాలంలో 14 లక్షల వరకు భారీ మొత్తం ప్రయోజనం
  • సెక్షన్ 80సీ కింద ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది
Post Office Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్స్ కోసం పోస్టాఫీసు సరికొత్త స్కీమ్, Tax Benefits సైతం వర్తిస్తాయి

Post Office Scheme: పోస్టాఫీసు అన్ని రకాల వయసుల వారితో పాటు సీనియర్ సిటిజన్స్‌కు సేవింగ్స్ స్కీమ్‌లు అందిస్తోంది. కరోనా సమయంలోనూ సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు అనతికాలంలోనే అధిక లాభాలు పొందనున్నారు. పోస్టాఫీసు స్కీములో ఇన్వెస్ట్ చేసిన వయోజనులకు 7.4 శాతంతో వడ్డీ ప్రయోజనాలు అందిస్తుంది. అయిదు సంవత్సరాల కాలంలో 14 లక్షల వరకు భారీ మొత్తం ప్రయోజనం పొందుతారు.

అకౌంట్ ఎవరు తెరవాలి..
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ పోస్టాఫీసు అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ (Post office savings account) తెరవడానికి అర్హులు. వయోజనుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం ఇది. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (Voluntary Retirement Scheme) తీసుకున్న వారు ఎస్‌సీఎస్ఎస్ పథకం కింద అకౌంట్ తెరవొచ్చు.

Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి

వయోజనులు ఒకేసారి రూ.10 లక్షల మేర భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీ నగదుకు భద్రత ఉంటుంది. అయిదేళ్ల కాలవ్యవధిలో రూ.14,28,964 మీ చేతికి మెచ్యురిటీ నగదు లభిస్తుంది. 4.28 లక్షల రూపాయల అదనపు ప్రయోజనం పొందుతారు. 7.4 శాతం వడ్డీతో పోస్టాఫీసు (Post Office) ఈ ప్రయోజనాలు అందిస్తుంది. పన్ను మినహాయింపు ప్రయోజనాలు సైతం లభిస్తాయి. 

ఈ స్కీమ్ మెచ్యురిటీ గడువు 5 సంవత్సరాలు. కాగా మరో మూడేళ్ల వరకు పొడిగించుకోవచ్చునని పోస్టాఫీసు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. పన్ను మినహాయింపు ప్రయోజనాలు కోరుకునే వయోజనులు Post Office Senior Citizen Savings Scheme పథకంలో చేరవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80సీ కింద ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. 

Also Read: LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ

జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. భార్య అకౌంట్ అయితే భర్తను యాడ్ చేయవచ్చు. భర్త పేరు మీద అకౌంట్ తీసుకున్నట్లయితే భార్య పేరును జాయింట్ అకౌంట్ కిందకి చేర్చాలి. గరిష్టంగా పెట్టుబడి 1.5 మిలియన్‌కు మించరాదు. మెచ్యురిటీ గడువు ముగియకముందే ఈ ఖాతాను మూసివేసే అవకాశం ఉంది. ఏడాది తరువాత అకౌంట్ క్లోజ్ చేస్తే 1.5 శాతం పెట్టుబడి నగదును కట్ చేస్తారు. రెండేళ్ల తరువాత అకౌంట్ క్లోజ్ చేస్తే 1 శాతం నగదు కోత విధించి మిగతా మొత్తం చెల్లిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News