Betel Leaf: తమలపాకుల ఫెస్ ప్యాక్.. ఇలా అప్లై చేస్తే వారంలో మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది..
సాధారణంగా చాలా మంది యువత అందంగా కన్పించేందుకు ఎక్కువగా తాపత్రయ పడుతుంటారు. దీనికోసం రకరకల క్రీమ్ లు తమ ఫెస్ లకు అప్లై చేసుకుంటు ఉంటారు. అంతే కాకుండా.. బ్యూటీ పార్లర్ ల దగ్గరకు వెళ్తుంటారు.
డబ్బులు ఎంతైన సరే.. తమ ముఖం మెరిసేలా చేయాలని బ్యూటీషీయన్ లకు చెబుతుంటారు. అయితే..సాధారణంగా మన ఇంటిలో, మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ముఖం మెరిసేలా చేసుకొవచ్చు.
దీనిలో తమల పాకులు కూడా ముఖం కాంతివంతం చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ముఖ్యంగా తమల పాకులను తీసుకుని, వాటిని గ్రైండర్ లో మిక్స్ చేసుకుని ముఖానికి పెట్టుకుంటే ముఖం ముత్యంలా మెరుస్తుంది.
తమల పాకులను మిక్సర్ ను తీసుకుని దానిలో పాల మీగడ, తేనెను వెయ్యాలి. ఒక గిన్నెలొ తీసుకుని అన్ని సరిగ్గా కలిసి పోయే విధంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత.. ఆ ప్యాక్ ను ముఖంకు పెట్టుకొవాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, గరుకుతనం పూర్తిగా మాయమైపోతాయి.
మెయిన్ గా చలికాలంలో ఇలాంటి పనులు చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, పింపుల్స్ తగ్గిపోతాయి. వారానికి రెండు, మూడు సార్లు ఈ ఫెస్ ప్యాక్ ముఖానికి పెట్టుకుంటే.. నెల రోజులు తిరక్కుండానే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, పింపుల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.