Bhagyashri Borse: రెండు భారీ అవకాశాలు కొల్పోయిన భాగ్యశ్రీ.. కారణం ఇదేనా?

Wed, 18 Dec 2024-8:11 pm,

మొదటి సినిమా విడుదల అవ్వక ముందే భారీ హైప్ తెచ్చుకున్న హీరోయిన్.. భాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొట్టమొదటి సినిమా. అయితే ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది. 

కాగా ఈ సినిమా.. విడుదలవ్వక ముందు నుంచి..భాగ్యశ్రీ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ ఆశలు అన్నీ కూడా.. ఈ చిత్రం విడుదలయ్యాక తారుమారు అయ్యాయి. సినిమా ఫ్లాప్ అవ్వడమే.. కాక ఆమె నటన కూడా ఎన్నో విమర్శలు తెచ్చిపెట్టుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి ఇంక ఆఫర్లే రావేమో.. అనుకుంటున్నా సమయంలో.. ఏకంగా రెండు భారీ ప్రాజెక్ట్ ఆఫర్లు చేతికి వచ్చాయట. కానీ వచ్చిన మంచి ఆఫర్లను సద్వినియోగపరచుకోకుండా.. భాగ్యశ్రీ వాటిని చేజార్చుకున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. 

 

ప్రముఖ వెబ్సైట్ ఐబీటీ కథనాల ప్రకారం.. ఈ హీరోయిన్ తన కోఆర్డినేటర్.. కిరణ్ అనే వ్యక్తి వల్లే అవకాశాలు చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబై ఏజెన్సీ ద్వారా.. మొదట్లో ఈ హీరోయిన్ కి మంచి సినిమా అవకాశాలు వచ్చాయట. ఇక ఆ టైంలోనే ఈమెకు తెలుగులో కూడా క్రేజ్ వచ్చింది. కానీ ఆ తరువాత తను.. కిరణ్ అనే ఒక వివాదాస్పద కోఆర్డినేటర్ ని నియమించుకుందని.. అతని మెనుపులేషన్స్ వల్లే ఈ హీరోయిన్ కి అవకాశాలు చేజారుతున్నాయని.. వినికిడి. 

 

అంతకుముందు రష్మిక కి కూడా మానేజర్ గా చేసిన ఈ వ్యక్తి.. తన మెనిపిలేషన్ బిహేవియర్ వల్ల.. రష్మిక దగ్గర కూడా చివాట్లు తిన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు భాగ్యశ్రీ వద్ద కూడా.. ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించడంతో.. ఈ హీరోయిన్ అతని నమ్మి.. వచ్చినా అవకాశాలు పోగొట్టుకుంటున్నట్టు.. వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక ప్రముఖ డైరెక్టర్ ఒక యంగ్ హీరోతో.. సినిమా చేస్తున్న సమయంలో.. భాగ్యశ్రీ కి కథ వినిపించగా ఆమె డైరెక్టర్ కే సలహాలు ఇచ్చిందట. కేవలం ఒకే ఒక్క ఫ్లాప్ సినిమా అనుభవం ఉన్న ఆమె.. బడా డైరెక్టర్లకి కూడా సలహాలు ఇచ్చేసరికి ఆ డైరెక్టర్ ఆమెను బయటకు పంపించేసారట. 

 

మొత్తానికి.. ఇలా అనేక కారణాలవల్ల..భాగ్యశ్రీ రెండు భారీ ప్రాజెక్టులను పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో.. భాగ్యశ్రీ.. వీటన్నిటి మీద శ్రద్ధ పెట్టకపోతే..ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కాంపిటీషన్ లో నెట్టుకో రావడం చాలా కష్టం లానే కనిపిస్తోంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link