Bharat Ratna: పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ సహా భారతరత్నతో గౌరవింపబడిన మాజీ ప్రధానులు వీళ్లే..
పీవీ నరసింహారావు:
దేశం దివాళ అంచున ఉన్న దశలో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టారు పీవీ నరసింహారావు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా.. ఆపై కేంద్ర మంత్రిగా.. ఆపై ప్రధాన మంత్రి అయ్యారు. అంతేకాదు భారత దేశాన్ని ఆర్ధికాభివృద్దిని నూతన పుంతుల తొక్కించిన ప్రధానిగా పీవీ నరసింహారావు నిలిచారు. ఆయన దార్శనికతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2024గాను చనిపోయిన 20 యేళ్లకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది.
చౌదరి చరణ్ సింగ్: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా .. దేశానికి అతికొద్ది కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన రైతుల కోసం ఆయన చేసిన సేవలు నిరుపమానం. అందుకే కేంద్రం మాజీ ప్రధానిని భారతరత్నతో గౌరవించింది. చనిపోయిన 37 యేళ్ల తర్వాత ఈయన్ని ఈ అవార్డు వరించింది.
అటల్ బిహారి వాజ్‌పేయ్:
మన దేశంలో కాంగ్రెస్ యేతర ప్రధాన మంత్రిగా 5 యేళ్లు పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించిన నేత అటల్ బిహారి వాజ్‌పేయ్. ఆర్ఆర్ఎస్ నుంచి దేశ ప్రధాన మంత్రి అయిన తొలి వ్యక్తిగా అటల్ జీ రికార్డులకు ఎక్కారు. అంతేకాదు అగ్ర రాజ్యాల ఆంక్షల నేపథ్యంలో 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు చేసి భారత దేశాన్ని అగ్ర రాజ్యాలకు ధీటుగా నిలిపారు. అంతేకాదు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ మెడలు వంచిన నేతగా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన సేవలను గుర్తించిన నరేంద్ర మోదీ.. 2015లో ఆయన్ని భారతరత్న అవార్డుతో గౌరవించింది.
గుల్జారీలాల్ నందా: నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల అకాల మరణంతో రెండు సార్లు దేశానికి తాత్కాలిక ప్రధాన మంత్రిగా సేవలు అందించారు. అంతేకాదు కేంద్రంలో కీలకమైన హోం సహా పలు కీలక శాఖలను నిర్వహించారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం పాకిస్థాన్‌లోని సిలాయ్ కోట్‌లో జన్మించారు. ఈయన సేవలను గుర్తించిన అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం 1997లో ఈయన్ని భారతరత్నతో గౌరవించింది.
మొరార్జీ దేశాయ్.. మొరార్జీ దేశాయ్ దేశంలో తొలి కాంగ్రెస్ యేతర ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.కానీ అంతర్గత కుమ్ములాటతో అప్పటి జనతా ప్రభుత్వం పడిపోయింది. ఈయన దేశానికి చేసిన సేవలకు గాను 1991లో అప్పటి కేంద్రంలో ఉన్న పీవీ ప్రభుత్వం ఈయన్ని భారతరత్నతో గౌరవించింది.
రాజీవ్ గాంధీ:
దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులోని పెరంబదూరులో మానవ బాంబు దాడిలో శ్రీలంక ఎల్టీటీఈ చేతిలో అసువులు బాసారు రాజీవ్ గాంధీ. దేశానికి కంప్యూటర్ వంటి అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేసిన ఈయనకు మరణాంతరం 1991లో కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది.
ఇందిరా గాంధీ: ఇందిరా గాంధీ .. నెహ్రూ బిడ్డగా దేశ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1971లో ఈమె పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారు. దీంతో ఈమె ఖ్యాతి పెరిగిపోయింది. ఆ తర్వాత 1971 ఆమె ప్రభుత్వమే ఇందిరాను భారతరత్న వంటి అత్యున్న గౌరవంతో సత్కరించింది.
లాల్ బహదూర్ శాస్త్రి: జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశ ప్రజల్లో దేశ భక్తిని రేకెత్తించిన నాయకుడిగా లాల్ బహదూర్ శాస్త్రి నిలిచారు. 1966లో అప్పటి రష్యాలోని తాష్కెంట్‌లో అనుమానాస్పదంగా కన్నుమూసారు. ఇప్పటికీ ఈయన మరణంపై మిస్టరీ వీడలేదు. ఈయనకు మరణాంతరం భారతరత్నతో గౌరవించింది అప్పటి ప్రభుత్వం. చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు ప్రకటించడమనే సంప్రదాయం ఈయన నుంచే మొదలైంది.
జవహర్ లాల్ నెహ్రూ: జవహర్ లాల్ నెహ్రూ నవ భారత నిర్మాతగా.. తొలి ప్రధాన మంత్రిగా దేశానికి చేసిన సేవలకు గాను 1955లో అప్పటి కేంద్రం ఈయన పేరును భారతరత్నకు ప్రతిపాదించింది. మొత్తంగా తొలి ప్రధాన మంత్రిగా భారతరత్న అవార్డు అందుకున్న తొలినేతగా రికార్డులకు ఎక్కారు.