Bhavani Deeksha: దసరా ముందు భవానీ దీక్షతో శుభం.. 11 రోజుల కఠిన దీక్షతో అమ్మవారి కటాక్షం 

Mon, 30 Sep 2024-8:06 pm,

దీక్ష ప్రత్యేకం: దసరా పండుగ ముందు భవానీ దీక్ష ప్రారంభమవుతుంది. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాల చేపడతారు.

నిత్యతో: ఈ దీక్ష 11 రోజుల పాటు కఠినంగా దీక్షను చేపట్టాల్సి ఉంది. అత్యంత నిష్టతో ఈ దీక్షను భక్తులు స్వీకరిస్తారు.

అమ్మవారి అనుగ్రహం: భవానీ దీక్ష కోసం అత్యంత జాగ్రత్త పాటించాల్సి ఉంది. అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునేవారు ఈ మాలను పొందుతారు.

అమ్మవారి నామస్మరణ: మాల స్వీకరించిన సమయంలో నిత్యం అమ్మవారి నామస్మరణ చేయాలి. ఇతరులను పలకరించే ముందు 'భవానీ' అని పలకరిస్తారు.

శక్తి స్వరూపిణి: భవానీ దీక్ష ధరించిన వారు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అత్యంత శక్తిస్వరూపిణిగా ఉన్న అమ్మవారు అనుగ్రహం కోసం ఈ దీక్షను చేపడుతారు.

గ్రంథాలు: ఈ దీక్ష చేపడితే సకల ఫలాలు దక్కుతాయని హిందూ ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి.

సంతాన ప్రాప్తి: మనో ధైర్యం.. అమ్మవారి కటాక్షం పొందేందుకు ఈ దీక్ష చేపడతారు. ఈ దీక్ష చేపడితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందనే నమ్మకం ఉంది.

నిత్యం పూజలు: 11 రోజుల కఠిన దీక్షలో ఉన్నంత కాలం అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపడతారు. చివరి రోజు అమ్మవారి ఆలయానికి చేరుకుని దీక్ష విరమించుకోవాలి.

దీక్ష విరమణ: దీక్ష స్వీకరించిన భక్తులు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను కూడా దర్శించుకుని అక్కడ దీక్ష విరమిస్తుంటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link