Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..

Tue, 10 Dec 2024-6:56 pm,

మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు ప్రస్తుతం ఇండస్ట్రీలో రచ్చగా మారాయి. ఇప్పటికే దీనిపై పరస్పర ఫిర్యాదులు సైతం చేసుకున్నారు. ఒకవైపు మంచు మనోజ్ తనపై, తనన భార్య పిల్లలపై  కొందరు దాడులు చేశారని పహాడీ షరీఫ్ ఫోలీసులకు ఫిర్యాదులు చేశారు.

మరోవైపు మోహన్ బాబు కమిషనర్ కు తన కొడుకు నుంచి తనకు ప్రాణహనీ ఉందని, కొంత మందితో కలిసి తనఇంట్లో గొడవలకు ప్రయత్నించారని కూడా ఫిర్యాదులు చేశారు. మంచు మనోజ్ ఇటీవల గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకొవడం కూడా.. హాట్ టాపిక్ గా మారింది.  

ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి ఆగమేఘాల మీద మంచు విష్ణు హైదరబాద్ కు వచ్చారు. అంతే కాకుండా.. మంచు మనోజ్, మంచు విష్ణుల బౌన్సర్ ల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తొంది. మంచు మనోజ్ ను ఇంటి నుంచి బైటకు గెంటేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ ఘటనలపై మాత్రం.. మంచు మనోజ్ సతీమణి మౌనిక.. అక్క భూమా అఖిల ప్రియ గమనిస్తున్నారంట. 

భూమా ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందని .. ఆమె వర్గీయులు కొంత మంద తీవ్ర అసహానంతో ఉన్నారంట. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీ గొడవల్లో అక్క కల్గజేసుకుంటే.. గొడవలు మరోవైపుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆమె సైలేంట్ గా ఉంటున్నారంట.  

కానీ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామల పరంగా మాత్రం.. భూమా అఖిల ప్రియా మాత్రం  సీరియస్ గా ఉన్నారంట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భూమా అఖిల ప్రియా.. ఈ విషయాలపై ఆరా తీస్తున్నారంట. మరోవైపు భూమా కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉందనే విషయం తెలిసిందే. భూమా నాగిరెడ్డి వారసులుగా వీరికంటూ రాయల సీమలో ప్రత్యేకంగా అభిమానం ఉంది.  

భూమా కుటుంబం ఒక పిలుపు ఇస్తే.. ఏమైన చేయడానికి సిద్దంగా అనేక కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. ప్రస్తుతం భూమా వర్గీయులు మాత్రం ఎంటర్ అయితే.. ఈ మంచు ఇంట గొడవ  కాస్త..ఫ్యాక్షన్ టర్నీ తీసుకొవడం ఖాయమని వార్తలు విన్పిస్తున్నాయి. 

తాజాగా.. మోహన్ బాబు కుటుంబానికి అసలు..భూమా మౌనికను పెళ్లి చేసుకొవడం ఇష్టంలేదని వార్త బైటపడింది. అందుకే.. ఇలా చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ సైతం. తన భార్యల కోసం అస్తిత్వానికి సంబంధించిందని... తాను... ఆస్తుల  కోసం గొడవలు పడట్లేదని  కూడా చెప్పడం కీలకంగా మారిందని చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ ఎంటర్ అయితే.. ఎలా ఉంటుందో అంటూ.. కొంత మంది మాత్రం ఆందోళన చెందుతున్నారంట.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link