Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..
ప్రస్తుతం ఎండలు దడపుట్టిస్తున్నాయి. వేసవి వేడిమి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లు తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
వేసవి వేడి నుంచి చల్లని కబురు అందించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 9 కీమీ ఎత్తులో ఏర్పడింది.
అంతేకాదు ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కేరళ వరకు కూడా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కురిస్తుయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
ఎండల వేడిమి విజృంభిస్తున్న తరుణంలో ఈరోజు నుంచి మరో రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదరుగాలులు గంటకు 50 కిలో మీటర్లల మేర వీచే అవకాశం ఉందని తెలిపింది.
రేపు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉందట. మండే ఎండలకు కాస్త ఉపశమం ఇచ్చే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది.