24 Year Scale: ముఖ్య గమనిక.. 24 Year Scale గురించి తప్పక తెలుసుకోండి.. చిన్న పొరపాటుతో భారీ నష్టం..!

Mon, 30 Dec 2024-5:12 pm,

ఎవరైనా SGT ఉపాధ్యాయులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. 24 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని.. డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా 24 Year Scale తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు.  

డీడీఓకు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంట్ వంటిది కాదు.  

ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.. A అనే వ్యక్తి 25 ఏళ్లు SGT గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడని అనుకుందాం.. తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.  

మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి. A అనే వ్యక్తికి ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. కానీ 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు  

B అనే టీచర్‌ కూడా A తో పాటు సర్వీసులోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడని అనుకుందాం..  

B మాత్రం 24 సంవత్సరాల స్కేల్ వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6, 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు.  

మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు. సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link