TTD Update: భక్తులకు అలర్ట్.. సుప్రభాత సేవ రద్దు..!
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాలలో అత్యంత ముఖ్యమైనది ధనుర్మాసం ఈరోజు ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 6:57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. వచ్చేనెల ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనం పైన టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమైన సందర్భంగా తిరుమలలో ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వపత్రాలతో సహస్రనామార్చన చేసి, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు.అలాగే విశేష నైవేద్యాలుగా బెల్లం దోస, సుండలు, దోశ, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. శ్రీవారి ఆలయంలో నెలరోజులు పాటు జరిగే తిరుప్పావై పారాయణం లో రోజుకు ఒకటి వంతెన అర్చకులు నివేదిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున జనవరి 10 నుండి 19 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
ఇక ఈ ధనుర్మాసం సందర్భంగా సుప్రభాత సేవను రద్దు చేసి ధనుర్మాస సేవలు ప్రారంభం కానున్నాయి. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలను ఈ 10 రోజులు రద్దు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలు కూడా ప్రతి రోజులపాటు రద్దు చేయడం జరిగింది.
ముఖ్యంగా భారీ క్యూ లైన్ లను నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవింద మాల దర్శించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా ఉండవు.