Diwali 2024: హైదరబాద్ వాసులకు బిగ్ షాక్.. దీపావళి రోజు టపాసులు కాల్చడంపైన నిషేధం..?..
ప్రస్తుతం దేశ మంతట కూడా దీపావళి సందడి నెలకొంది. అంతే కాకుండా.. టపాసులను కొనేందుకు కూడా చాలా మంది టపాసుల దుకాణాలు క్యూలు కట్టినట్లు తెలుస్తొంది. ఎక్కడ చూసిన కూడా పటాకాయల దుకాణాలన్ని రద్దీగా కన్పిస్తున్నాయి.
దీపావళి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దీపావళిని ఐదురోజుల పండుగగా జరుపుకుంటారు. అంతే కాకుండా.. నరక చతుర్దశి రోజున నరకుడ్ని, సత్యభామ సంహారించినందుకు గాను, అమావాస్య రోజున దీపాలు వెలిగించి పండుగలా చేసుకున్నట్లు తెలుస్తొంది.
సుప్రీంకోర్టులో గతంలో టపాసులు కాల్చడంపైన అనేక పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో భారీగా శబ్దాలు వచ్చే టపాసులు కాల్చడంపై సుప్రీంకోర్టు పలు సూచనలు జారీ చేసింది. తాజాగా, ఈ నిబంధనలను ప్రకారం.. మరొమారు హైదరబాద్ పోలీసులు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
హైదరాబాద్ వ్యాప్తంగా దీపావళి రోజు అంటే.. 31 న రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తొంది. మిగతా సమయంలో టపాసులు కాల్చడంపై సుప్రీంకొర్టు మార్గదర్శకాల్ని పాటించాలని హైదరబాద్ పోలీసులు ఆదేశించారు
అంతే కాకుండా.. టపాసులు అమ్మేవారు తప్పనిసరిగా పోలీసుల నుంచి లైసెన్స్ లను తీసుకొవాలని, భారీ శబ్దాలు వచ్చే టపాసులు అమ్మే సందర్బంగా ఎమర్జెన్సీ జాగ్రత్తలు తీసుకొవాలని ఆదేశించారు. చిన్నపిల్లలు, పెద్ద వయస్సు వాళ్లకు ఇబ్బందులు కల్గకుండా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
హైదరబాద్ వ్యాప్తంగా ప్రజలంతా.. జాగ్రత్తగా రాత్రిపూట 8 నుంచి 10 వరకు టపాసులు కాల్చుకొవచ్చని కూడా నగర పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తొంది. దీంతో టపాసుల దుకాణదారులు మాత్రం ఈ ఆదేశాలపై ఆందోనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. శబ్ధ కాలుష్య ఫిర్యాదుల కోసం100కు డయల్ చేయవచ్చని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.