DA Hike: సీనియర్ కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. దాదాపు అన్ని వేల రూపాయలు పెంపు..!
తాజాగా ఐదవ వేతన సంఘం ప్రకారం ఆరవ వేతన సంఘం యొక్క డి ఏ మార్పు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా డియర్ నెస్ అలవెన్స్ పెంచినట్లు ఆఫీస్ మెమోరాండం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది
మరోవైపు ఆరవ కేంద్ర వేతన సంఘం ముందస్తుగా సవరించిన పే స్కేల్ ప్రకారం జీతాలను ఉపసంహరించుకునే కేంద్ర స్వయం ప్రతిపత్త సంస్థల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ పెంచింది. 239 శాతం నుండి 246 శాతానికి పెంచింది.
డియర్ నెస్ అలవెన్స్ యొక్క సవరించిన రేటు 2024 జనవరి 1 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. ఇకపోతే డి ఏ పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ పై ఆధారపడి ఉంటుంది.
దీని ప్రకారం ఉదాహరణను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం నెలకు రూ.43,000 అయితే ఆమె ఆరవ వేతన సంఘం ప్రకారం జీతం తీసుకున్నట్లయితే 239 శాతం వద్ద ఆమె వేతనం రూ.1,02,770.. ఇక నవంబర్ 7 2024 నాటి ఆఫీస్ మెమోరాండం ప్రకారం ప్రస్తుతం ఉన్న 235% నుండి 246% కి పెరిగిన తర్వాత డి ఎ రూ.1,06,780.
మరోవైపు ఏడవ వేతన సంఘం ప్రకారం జీతాలు తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్ నెస్ అలవెన్స్ అలాగే డియర్ నెస్ రిలీఫ్ కూడా పెంచడం జరిగింది. 50% నుండి 53 శాతానికి పెంచారు. జూలై ఒకటి 2024 నుండి వర్తిస్తుంది. మరోవైపు ఆరవ వేదన సంఘం లేదా 5వ వేతన సంఘం ప్రకారం జీతం లేదా పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ప్రభుత్వం నుండి తమ డిఏ లేదా డిఆర్ సవరణ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ డియర్ నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతంలో ఒక భాగంగా పరిగణించబడుతుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలైలో డిఏని సవరిస్తుంది అర్బన్ సెక్టార్ , సెమీ అర్బన్ సెక్టార్ లేదా రూరల్ సెక్టార్లో పనిచేస్తున్నారా అనేదాన్ని ఆధారంగా కూడా మారుతూ ఉంటుంది. అలాగే ఈ అలవెన్స్ ఉద్యోగి నుండి మరో ఉద్యోగికి మారుతూ ఉంటుందని ఉద్యోగులు గమనించాలి.