Dog Divorce: కుక్క కోసం విడిపోయిన హీరోయిన్‌.. ఇది సినిమా స్టోరీ కాదు యథార్థ సంఘటన

Tue, 17 Dec 2024-7:28 pm,

ఎవరు పవి పూవప్ప: కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ పవి పూవప్ప. పవి పూవప్పకు విపరీతమైన పాపులారిటీ ఉంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు.

వైల్డ్‌కార్డుతో ఎంట్రీ: ఫ్యాషన్ డిజైనర్‌గా, వృత్తిరీత్యా మోడల్‌గా రాణిస్తున్న పవి పూవప్ప 'బిగ్‌బాస్ సీజన్ 10'లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే విజేతగా నిలవకుండా వెనుదిరిగింది.

ఇంటర్వ్యూలో సంచలనం: ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే పవి పూవప్ప తాజాగా తన ప్రియుడి గురించి సంచలన విషయాలు వెల్లడించింది. బిగ్‌బాస్ సందర్భంగా తన ప్రేమ విషయాలు పంచుకుంది. ఓ యూట్యూబ్‌ చానల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడింది.

ప్రియుడు ఎవరు: `నా ప్రియుడు డీజే మ్యాడీ ఐర్లాండ్‌లో పనిచేస్తున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది' అని పవి పూవప్ప తెలిపింది.

కుక్కతో కొట్లాట: 'అయితే పెళ్లయ్యాక కుక్కను ఇంట్లో ఉండొద్దు అని చెప్పాడు. నేను వద్దని చెప్పా. అక్కడే మా మధ్య సమస్య మొదలైంది. చిన్నచిన్న సమస్యలకు కారణాలు చెప్పడం మొదలుపెట్టేవాడు. అందుకే విడిపోదామని నిర్ణయించుకున్నా' అని పవి పూవప్ప వెల్లడించింది.

పెళ్లి తర్వాత: 'మేం ఐదేళ్లుగా కలిసి ఉన్నాం. నా కుక్క వారిని ఇబ్బంది పెట్టింది. పెళ్లయ్యాక కుక్కను పెంచుకోవడానికి అంగీకరించలేదు. చిన్న విషయం కూడా విసుగు తెప్పిస్తుంది. అందుకే విడిపోదామని చెప్పి ' అని పవి పూవప్ప తెలిపింది.

రిలేషన్‌షిప్‌ బ్రేక్‌: 'ఐదేళ్లుగా డీజే మ్యాడీతో రిలేషన్‌షిప్‌లో ఉండడంతో అందరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అసత్యం. మేము విడిపోయాం' అని పవి పూవప్ప స్వయంగా చెప్పింది.

వార్త వైరల్‌: పెంపుడు కుక్క వల్లే మ్యాడీ, పవి పూవప్ప బ్రేకప్‌ చెప్పుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link