Sonia Akula: భార్యాపిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న బిగ్‌బాస్ ఐటమ్ బాంబ్
కంటెస్టెంట్‌గా: యాంకర్‌గా.. నటిగా గుర్తింపు పొందిన ఆకుల సోనియా బిగ్‌బాస్ 8వ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే.
తెలంగాణ బిడ్డ: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన సోనియా తన స్టైల్.. యాసతో సోషల్ మీడియాను ఆకట్టుకుంది.
గట్టి పోటీ: బిగ్‌బాస్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చి ఈ సీజన్లో ప్రధాన కంటెస్టెంట్ అవుతుందని అందరూ భావించారు.
ఎలిమినేట్: కొన్ని తప్పిదాలు.. కొందరితో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో నెటిజన్ల ఓట్లు పొందలేక విఫలమై హౌస్ నుంచి సోనియా బయటకు వచ్చింది.
ప్రియుడితో: హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా తన ప్రియుడు యశ్ వీరగోనితో నిశ్చితార్థం చేసుకుంది. వీరి పెళ్లి ఎప్పుడో నిశ్చయమైందని బిగ్‌బాస్ అవకాశం రావడంతో వాయిదా పడినట్లు సమాచారం.
నిశ్చితార్థం: నవంబర్ 21వ తేదీన యశ్, సోనియా నిశ్చితార్థ వేడుక జరిగింది. కొద్దిమంది మాత్రమే బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు.
విడాకులైనా..: అయితే సోనియా చేసుకోబోయే యశ్‌కు గతంలోనే వివాహమై విడాకులు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని సోనియా పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది.