Bigg Boss Telugu 4: బెస్ట్ కెప్టెన్ హారిక.. వరస్ట్ ఎవరో తేల్చేందుకు రచ్చరచ్చ!

Sat, 28 Nov 2020-9:18 am,

బిగ్‌బాస్ తెలుగు 4 తుది అంకానికి చేరుకుంది. రేస్ టు ఫినాలే మొదలైంది. దీంతో ఇక ఇంటి సభ్యుల అసలు ఆట షురూ అయినట్లే. అయితే ఇన్నిరోజులు బిగ్‌బాస్ సీజన్ 4 ఇంట్లో ఉన్నది ఒక ఎత్తయితే.. ఇక నుంచి వారు తీసుకోబోయే నిర్ణయాలు మరో ఎత్తు అని తెలుస్తోంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో సరిగా ఆడలేదంటూ హౌస్‌మేట్స్‌పై బిగ్‌బాస్ మండిపడ్డాడు. ఇన్ని వారాల జర్నీ తర్వాత మీరు నేర్చుకున్నది ఇదేనా, ఇంటి నియమాలు ఇంకెప్పుడు నేర్చుకుంటారా అని ప్రశ్నించారు. బిగ్‌బాస్ క్లాస్ పీకడంతో కంటెస్టెంట్స్ కంగుతిన్నారు. అసలు ఏం జరిగిందా అని వివరణ ఇచ్చుకున్నారు.  (Photo: Twitter/StarMaa)

ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 4లో బెస్ట్ కెప్టెన్ ఎవరు, వరస్ట్ కెప్టెన్ ఎవరు అనేది తేల్చుకోవాలని కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ సూచించాడు. బిగ్‌బాస్ ఆదేశాలతో చర్చ మొదలైంది. అభిజిత్, అరియానా, సహా మరో రెండు రావడంతో దేత్తడి హారిక బిగ్‌బాస్ సీజన్ 4లో బెస్ట్ కెప్టెన్‌గా నిలిచింది. రోజురోజుకూ తన ఆట మెరుగు పరుచుకుంటూ వెళ్తూ రేస్ టు ఫినాలేకు సిద్ధమైంది హారిక.  (Photo: Twitter/StarMaa)

మరోవైపు బిగ్‌బాస్ తెలుగు 4లో చెత్త కెప్టెన్ అనేదానిపై భారీగానే చర్చ జరిగింది. ఎప్పటిలాగే టామ్ అండ్ జెర్రీ వార్ మళ్లీ మొదలైంది. ఎప్పటిలాగే ఇస్మార్ట్ సోహైల్ తన అభిప్రాయాన్ని చెబుతూ వరస్ట్ కెప్టెన్ అరియానా అని చెబుతాడు. అరియానా కూడా సోహైల్ పేరు చెబుతుంది. అయితే వెక్కిరిస్తూ, తన చేష్టలతో అరియానాతో పాటు తోటి కంటెస్టెంట్స్‌కు విసుగు తెప్పించాడు. (Photo: Hotstar)

అవినాష్‌ని వరస్ట్ కెప్టెన్ అని అఖిల్ చెప్పాడు. అఖిల్‌ని వరస్ట్ కెప్టెన్ అంటూ అభిజిత్ వివరణ ఇచ్చాడు. లక్ కొద్దీ కెప్టెన్ అయ్యాడని అభిజిత్ చెప్పగా.. నువ్వు అనుకున్నది చెప్పేశావ్ సోది ఎందుకు అని అఖిల్ కౌంటర్ ఇచ్చాడు. డిస్కషన్ అయిపోయిన తర్వాత అరియానాను వరస్ట్ కెప్టెన్ అని మెజారిటీ ఇంటి సభ్యులు నిర్ణయానికి వచ్చారు. బిగ్‌బాస్‌కు ఇదే విషయాన్ని చెప్పారు. (Photo: Hotstar)

నువ్వు నాకన్నా బెస్ట్ అని అరియానాతో అభిజిత్ అన్నాడు. నువ్వు కెప్టెన్ కూడా అయ్యావు నేను కాలేకపోయాను అని అరియానాకు సర్దిచెప్పే యత్నం చేశాడు. పరిస్థితిని బట్టి ఓ ప్రక్రియలో అలా వచ్చింది కానీ వ్యక్తిగతంగా ఏ సమస్య లేదని అరియానాకు నచ్చజెప్పాడు. అయితే నువ్వు నీ గేమ్ పరంగా బాగానే ఆడావు అని అభిజిత్‌తో అరియానా చెప్పింది. (Photo: Hotstar)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link