Biperjoy cyclone Pics: బిపర్‌జోయ్ తుపాను బీభత్సం ఎలా ఉందో తెలియాలంటే ఈ ఫోటోలు చాలు
కచ్, కరాచీ తీరాల్ని అతలాకుతలం చేస్తున్న బిపర్‌జోయ్ ధాటికి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాకాసి కెరటాలు వంతెనను మింగేస్తున్న వీడియో చూస్తే చాలు..పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బిపర్‌జోయ్ తుపానును అత్యంత తీవ్ర తుపానుగా పరిగణిస్తున్నారు. గుజరాత్ కచ్ తీరంతో పాటు ద్వారక, జామ్నా నగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఊహించినట్టే బలమైన ఈదురుగాలులు విధ్వంసం రేపుతున్నాయి.
విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మొత్తం చీకటి అలముకుంది. ద్వారకా, ఒఖా, నాలియా, భుజ్ పోరుబందర్, కాండ్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఇప్పటికే లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గుజరాత్ కచ్ తీరంలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి.
కచ్ జిల్లా జఖౌ ఓడరేవుకు సమీపంలో మాండ్వి, పాకిస్తాన్ కరాచీ మధ్యలో తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బిపర్‌జోయ్ తుపాను కారణంగా గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి.