Bitter Gourd: కాకరకాయ చేదుగా ఉందని తినకుంటే అంతే సంగతి !!
కాకరకాయ లాభాలు తెలుస్తే మళ్లీ మళ్లీ తింటారు..!
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: కాకరలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: కాకరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆహారం.
చర్మం ఆరోగ్యానికి మంచిది: కాకరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ముఖం మీద మొటికలు రాకుండా నిరోధిస్తాయి.
కళ్ళ ఆరోగ్యానికి మంచిది: కాకరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంటిచూపు మెరుగుపరుస్తుంది.
షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది: కాకరలో చక్కెర తక్కువగా ఉండటంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది.
హై బీపీ నియంత్రిస్తుంది: కాకరలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో హై బీపీ నియంత్రణలో ఉంచుతుంది.