Black Apples: వావ్.. అత్యంత అరుదైన బ్లాక్ యాపిల్స్.. ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..
ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు పోయే అవసరం ఉండదని కూడా పెద్దలు చెబుతుంటారు.దీని వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలా మంది తమ డైట్ లో యాపిల్ ను తప్పనిసరిగా చేర్చుకుంటారు.
రోజు యాపిల్ ను తినేవారిలో మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా.. రక్త ప్రసరణ కూడా సమర్థవంతంగా జరుతుంది. దీని వల్ల శరీరానికి అనేక విటమిన్ లు, మినరల్స్ లభిస్తాయి.
చాలా మంది ఎరుపు, గ్రీన్ కలర్ లో ఉన్న యాపిల్స్ లను ఎక్కువగా తింటుఉంటారు. కానీ అత్యంత అరుదుగా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే బ్లాక్ యాపిల్స్ లు పండుతాయి. ఇది ఎరుపు, గ్రీన్ కలర్ యాపిల్ కన్న.. ఎక్కువ పోషకాల్ని కల్గి ఉంటుంది.
బ్లాక్ యాపిల్స్ లను డైమండ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి టిబెట్ లో పండుతాయంట. ఇవి సాగు చేయడానికి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉండాంట. అలాంటి ప్రదేశంలలో మాత్రమే బ్లాక్ యాపిల్స్ ను పండుతాయంట. అందుకే ఇది చాలా అరుదుగా కన్పిస్తుంది.
సామాన్యంగా యాపిల్స్ అనేవి కేజీకి సీజన్ ను బట్టి 200 రూపాయలు లేదా 400 రూపాయల వరకు ఉంటుంది. అదే విధంగా.. ఈ బ్లాక్ యాపిల్ మాత్రం ఒక యాపిల్ రూ. 500 వరకు ఉంటుంది. అంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకొవచ్చు.
దీనికుండే డిమాండ్ మాత్రమే కాకుండా.. దీనిలో పుష్కలమైన పోషకాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది టిబెట్ లో దొరికే ఈ బ్లాక్ యాపిల్స్ అంటే ఇష్టంతో తింటారు. ఇవి పండించడం కూడా చాలా కష్టంతో పాటు, కాస్లీగా కూడా ఉంటుందని చెబుతుంటారు. ఈ తోటలకు సీసీ కెమెరాలను, సెక్యురిటీలతో కూడా నిఘా పెడుతారంట. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)