Blobfish Facts: ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన ఫీష్ .. చూస్తే వాంతి వచ్చినట్టే..!!
ప్రకృతిలోని అందం అంతా మన మాటలతో వర్ణించలేని విధంగా ఉంటుంది. ప్రకృతిలోని వివిధ జీవుల అందం మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఒక చిన్న పువ్వు నుంచి ఒక విశాలమైన సముద్రం వరకు, ప్రతిదీ తనదైన అందాన్ని ప్రదర్శిస్తుంది.
అంత అందమైన ప్రకృతిలో ఎప్పుడైనా బ్లాబ్ ఫిష్ గురించి విన్నారా..? బ్లాబ్ ఫిష్‌ను ప్రపంచంలోనే అత్యంత వికారమైన జీవి అని కూడా పిలుస్తారు. ఇది సముద్రంలో ఉండే ఒక రకమైన జీవి. ఇది చూడడానికి గులాబీ-బూడిద రంగులో ఉంటుంది.
ఈ జీవి బ్లాసంటిమోర్ ఆస్ట్రేలియా తీరంలో 800 మీటర్ల లోతులో నివసిస్తుంది. దీని చర్మం జెల్లీగా ఉంటుంది. నీటితో నిండిన శరీరంతో ఇతర చేపల నుంచి భిన్నంగా ఉంటుంది. గుండ్రని ఆకారంతో నీటిలో నివసిస్తుంది.
అధిక నీటి పీడనం కారణంగా, సముద్ర ఉపరితలంపైకి వచ్చినప్పుడు దీని శరీరం వక్రంగా మారిపోతుంది. దీనిని కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత అందంగా లేని చేపగా పేరు పొందింది.
ఆస్తకిరమైన విషయం ఏమిటి అంటే దీని ఫోటుతో సోషల్ మీడియాలో వివిధ రకాల జోక్స్ కూడా ఉంటాయి. ఈ ఫోటోలు వైరల్ అయిన తరువాత ఈ బ్లాబ్ ఫిష్‌ఉ మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు.
బ్లాబ్ ఫిష్ చిన్న చిన్న చేపలు తింటుంది. అంతేకాకుండా ఆహారం కోసం ఇది గంటల తరబడి ఒకే చోట ఉంటుంది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన జీవి.
ప్రస్తుతం బ్లాబ్ ఫిష్‌లు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. సముద్రంలో కాలుష్యం, అతిగా చేపలు పట్టడం వల్ల వీటి జాతులు ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.