Bollywood Actors Love Affairs: విడాకుల తరువాత ప్రేమలో పడ్డ బాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా

Wed, 12 Jul 2023-12:13 am,

సైప్ అలీ ఖాన్-కరీనా కపూర్

సైఫ్ అలీ ఖాన్ విడాకుల అనంతరం కొద్దికాలం ఓ విదేశీ మోడల్‌తో ప్రేమలో ఉన్నాడు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత సైఫ్ జీవితంలో కరీనా కపూర్ ప్రవేశించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు.

సబా ఆజాద్-హృతిక్ రోషన్

హృతిక్ రోషన్, సబా ఆజాద్ జంట గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. గత ఏడాదే ఈ ఇద్దరి ఎఫైర్ గురించి బయటికి తెలిసింది. ఇప్పుడీ ఇద్దరి పెళ్లి కూడా దాదాపుగా నిశ్చయమైనట్టేనట. 2014లో హృతిక్ రోషన్ మొదటి భార్య సుజైన్‌తో విడాకులైంది.

ఫర్హాన్ అఖ్తర్-షిబానీ

ఫర్హాన్ అఖ్తర్ గత ఏడాది షిబానీ దాండేకర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఫర్హాన్ అఖ్తర్‌కు ఇది రెండవ పెళ్లి. రెండవ పెళ్లితో చాలా సంతోషంగా ఉన్నాడట.

అర్జున్ రాంపల్-గేబ్రియేలా డెమోట్రియడ్స్

ప్రస్తుతం ఈ ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి కాకుండానే గేబ్రియేలా తల్లి అయింది. అయినా ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఆనందంగా జీవిస్తున్నారు.

అర్బాజ్-జార్జియా ఏండ్రియానీ

అర్బాజ్ ఖాన్ , మలైకా అరోరా విడాకులు 2017లో అయ్యా.యి. ఆ వెంటనే విదేశీ మోడల్ జార్జియా ఏండ్రియానీతో కలిసి జీవించాడు. ఇటీవలే ఈ ఇద్దరికీ కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link