Neha Dhupia Yoga Pics: నేహా దూపియా యోగా పిక్స్.. కత్రినా కైఫ్ ఫిదా!
తాజాగా నేహా దూపియా తన కొడుకుతో కలిసి యోగా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై కత్రినా కైఫ్ లవ్ ఎమోజీలతో స్పందించారు.
నేహా తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించారు. రాజశేఖర్ హీరోగా నటించిన విలన్, బాలకృష్ణ హీరోగా వచ్చిన పరమవీర చక్ర సినిమాలో కథానాయికగా నటించారు.
నేహా దూపియాకి సినిమా అవకాశాలు తగ్గడంతో అంగద్ బేడిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని షోలకు యాంకర్‌గా చేశారు.
జూలీ తర్వాత నేహా దూపియా చాలా సినిమాలు చేశారు. అయితే జూలీ సినిమాకు వచ్చినంత పేరు, క్రేజ్ మరే సినిమాకు రాలేదు.
జూలీ (2004) సినిమాతో నేహా దూపియా కుర్రకారుకి నిద్ర లేకుండా చేశారు. ఆ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని ఒకసారి తనవైపు తిప్పుకున్నారు.
నేహా దూపియా.. 2002లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. దీంతో బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి. 2003లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'ఖయామత్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.