Bone Health: ఎముకలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్ దూరం పెట్టాలి
టీ కాఫీ
దేశంలో టీ-కాఫీ తాగేవారికి కొదవ లేదు. చాలామంది టీ కాఫీతోనే దినచర్య ప్రారంభిస్తుంటారు. కానీ ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఇందులో ఉండే కెఫీన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది.
సోడా డ్రింక్
చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ , సోడా తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
సాల్ట్ పదార్ధాలు
సోడియం ఎముకలకు తీవ్ర నష్టం చేకూరుస్తుందది. దాంతో ఆస్టియోపోరోసిస్ వ్యాధి ముప్పు పెరుగుతుంది. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల బలహీనంగా మారుతాయి.
మద్యం
మద్యం అనేది కేవలం ఎముకల అనారోగ్యానికే కాదు చాలా వ్యాధులకు కారణమమౌతుంంది. ఎముకలకు హాని కల్గిస్తుంది. ఎముకల ఎదుగుదల నిలిచిపోతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది.
స్వీట్ ఫుడ్
స్వీట్స్ తినడం చాలా మందికి ఇష్టం. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల కేవలం డయాబెటిస్ రోగులకే మంచిది కాదనుకుంటాం. కానీ ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంచేందుకు స్వీట్స్‌కు దూరంగా ఉండాలి