BSNL: వావ్ బీఎస్‌ఎన్‌ఎల్ అతిచౌకైన రీఛార్జీ ప్లాన్.. రూ.150 రోజుల వ్యాలిడిటీ ప్రతిరోజూ 2 జీబీ డేటా ఎంత తక్కువో తెలుసా?
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధర రీఛార్జీ ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది దిగ్గజ ప్రైవేటు టెలికాం కంపెనీలకు గట్టి పోటీ కూడా ఇస్తుంది. ఈరోజు కూడా లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రీఛార్జీ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
ఈరోజుల్లో చాలామందికి రెండు సిమ్ కార్డులు కచ్చితంగా రెండు వేర్వేరు కంపెనీలకు సంబంధించినవి వినియోగిస్తారు. మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ వినియోగిస్తున్నట్లయితే మీకు ఓ గుడ్ న్యూస్. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.397 ప్లాన్‌తో మీరు 150 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్‌తో మీరు ఎన్నో లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. చౌక ధరలో రోజూ 2 జీబీ డేటా సూపర్ ప్లాన్.
అంతేకాదు ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. కానీ, ఈ బెనిఫిట్స్ మాత్రం కేవలం నెల రోజులు మాత్రమే పొందుతారు. అంటే మీ సిమ్ యాక్టీవ్‌లో ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
టెలికాం ధరలు జూలై నెలలో అన్ని ప్రైవేటు కంపెనీలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎక్కువ మంది పోర్ట్ అయ్యారు. మరిన్నీ ఆకర్షణీయమైన ధరలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తూ ఈ ప్రభుత్వ కంపెనీ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంటుంది.