BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త రీఛార్జీప్లాన్.. ప్రతిరోజూ 1 జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ ఎంత తక్కువ తెలుసా?
ప్రభుత్వ రంగ కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలు అందుబాటులో ఉంచుతుంది. దీంట్లో ఎక్కువ శాతం మొబైల్ రీఛార్జ్ చేసుకునేవారు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుతున్నారు. టెలికాం కంపెనీ ట్యారిఫ్ పెంచడంతో జియో ,ఎయిర్టెల్ నుంచి చాలామంది బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యారు.
ఎందుకంటే ప్రైవేటు టెలికాం కంపెనీలు ట్యారిఫ్ 15% వరకు వీటి ధరలను పెంచేసాయి. బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ తో కేవలం రూ. 400 తో అపరిమిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్లను అందుబాటులో ఉంచింది. ఆ వివరాలు తెలుసుకుందాం
బిఎస్ఎన్ఎల్ 340 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ దీంతో 60 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం ప్రతిరోజు వన్ జీబీ డేటా ఆ తర్వాత 40 కేబీపీఎస్ నెట్ స్పీడ్ పొందుతారు.
బడ్జెట్లో ఉండే ఈ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ప్రైవేట్ టెలికాం కంపెనీ లకు ఇది బిగ్ చాలెంజ్ ఇలాంటి సరికొత్త ఆఫర్లతో బిఎస్ఎన్ఎల్ 29 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను అదనంగా చేర్చుకుంది.
ఈ నేపథ్యంలో జియో 7,50,000 యూజర్లు, ఎయిర్టెల్ 16 లక్షలకు పైగా యూజర్లను పోగొట్టుకుంది దీంతో జియో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల జాబితా 29.3 కోట్లకు చేరింది.